Sunday, March 15, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పారిశుద్ధ్య కార్మికులకు సరుకులు వితరణ

పారిశుద్ధ్య కార్మికులకు సరుకులు వితరణ

- Advertisement -

నవతెలంగాణ – ఆర్మూర్   
99 రోజుల ప్రజా పాలనా – ప్రజా ప్రణాళికలో భాగంగా ఆలూరు మండలంలోని కల్లడి గ్రామ సర్పంచ్ గంగోల్ల సుస్మిత ప్రళయ్ తేజ్, పాలక వర్గం ఆధ్వర్యంలో ఆదివారం పారిశుద్ధ కార్మికులను సన్మానించినాడు. గ్రామ పంచాయతీ వద్ద పారిశుధ్య కార్మికులకు వారి సేవలని గుర్తించి వారికీ సన్మానం చేసి అలాగే వారికి నెల కి సరిపడా సబ్బులు, సరుకులు అందివ్వడం జరిగింది. సర్పంచ్ జన్మదిన సందర్భంగా పాలకవర్గం ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించుకున్నారు. ఈ కార్యక్రమం పంచాయతీ కార్యదర్శి బానుక చంద్రశేఖర్, ఉప సర్పంచ్ ఇస్సపల్లి రాజు వార్డ్ సభ్యులు , పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. 

ఎన్నికలలో ఇచ్చిన హామీలు నిలపెట్టుకుంటున్న  సర్పంచ్..
కల్లెడ గ్రామ సర్పంచ్ గంగోల్ల సుస్మిత ప్రళయ్ తేజ్ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటున్నారు. గ్రామానికి చెందిన మోర్తాడ్ అపర్ణ రాజేందర్ గార్ల దంపతులకు ఆడపిల్ల జన్మించగా, ఈ సందర్భంగా సర్పంచ్ ఆ కుటుంబానికి రూ.2,000 నగదు ఆర్థిక సహాయం అందజేశారు.

ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ ..ఆడబిడ్డల భవిష్యత్తు కోసం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రవేశపెట్టిన సుకన్య సమృద్ధి యోజన పథకంలో ఖాతా తెరిచి డబ్బులు జమ చేయాలని సూచించారు. ఎన్నికల సమయంలో గ్రామ ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తానని, నిరుపేద కుటుంబాలకు ఎల్లప్పుడూ అండగా ఉంటానని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -