Saturday, July 19, 2025
E-PAPER
Homeఆదిలాబాద్ఆశ్రమ స్కూల్ స్టూడెంట్స్ కు ట్యాబ్ ల పంపిణీ..

ఆశ్రమ స్కూల్ స్టూడెంట్స్ కు ట్యాబ్ ల పంపిణీ..

- Advertisement -

నవతెలంగాణ – బజార్ హత్నూర్: మండలంలోని జాతర్ల గ్రామంలోని స్పోర్ట్స్ స్కూల్, మాడగూడ గ్రామంలోనీ గిరిజన ఆశ్రమ హై స్కూల్ లోని విద్యార్థులకు గురువారం బీజేపీ మండల అధ్యక్షుడు పోరెడ్డి శ్రీనివాస్ ట్యాబ్ లను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంపీ గోడం నగేష్, ఓఎన్జేసీ సంస్థ సహకారంతో విద్యార్థులకు ట్యాబ్ లను అందజేస్తున్నట్లు తెలిపారు. ప్రైవేటు స్కూళ్లకు ధీటుగా గవర్నమెంట్ స్కూళ్లలోని విద్యార్థులకు సాంకేతిక విద్యను అందించాలనే లక్ష్యంతో ట్యాబ్ లను అందజేస్తున్నామన్నారు. విద్యార్థులు కష్టపడి కాకుండా ఇష్టపడి చదవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు నానం రమణ, కేవల్ సింగ్, ఈశ్వర్, నాగోరావు, టీచర్లు, స్టూడెంట్లు, తదితరులు పాల్గొన్నారు .

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -