Wednesday, February 11, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్నాలుగురోజులు గడువున్న బాలమృతం పంపిణీ!

నాలుగురోజులు గడువున్న బాలమృతం పంపిణీ!

- Advertisement -

– మండలంలో పంపిణీ చేసిన అంగన్వాడీలు
-పౌష్టికాహార పంపిణీ తీరుపై సర్వత్రా విమర్శలు

నవతెలంగాణ-బెజ్జంకి : రూ.కోట్ల నిధులు వెచ్చించి ప్రజలకు పౌష్టికాహారం అందించి ఆరోగ్యవంతమైన జీవనం సాగించేల ప్రభుత్వాలు శాయశక్తుల కృషి చేస్తున్నా..ఐసీడీఎస్, అంగన్వాడీ కేంద్రాల సిబ్బంది నిర్లక్ష్యం వల్ల ప్రజాధనం వృథాతో పాటు ప్రభుత్వాల లక్ష్యం నీరుగారుతోంది. బుధవారం మండలంలో సుమారు నాలుగు రోజుల్లో గడువుకాలం ముగియనున్న బాలమృతం పౌష్టికాహారాన్ని అంగన్వాడీ కేంద్రాల నిర్వహకులు ప్రజలకు పంపిణీ చేయడం ఆశ్చర్యం.నవంబర్ 15,2025న (11 ఏ) తయారైన బాలమృతం పౌష్టికాహారం(హేచ్ఎస్ 100ఎల్) పిబ్రవరి 15,2026న గడువుకాలం ముగియనుంది.నాలుగురోజుల్లో గడువు ముగుస్తున్నా బాలమృతం పౌష్టికాహారాన్ని అంగన్వాడీ కేంద్రాల నిర్వహాకులు పంపిణీ చేయడం ఐసీడీఎస్ అధికారుల పర్యవేక్షణ లోపానికి తార్కణంగా నిలుస్తోంది.గడువు ముగుస్తున్న పౌష్టికాహారాన్ని పంపిణీ చేసిన అంగన్వాడీ కేంద్రాల నిర్వహాకులు,పర్యవేక్షణలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ఐసీడీఎస్ అధికారులపై 

ఆహార భద్రత కమిషన్ సభ్యులు,సంబంధిత జిల్లాధికారులు విచారణ జరిపి తగు చర్యలు చేపట్టాలని మండల ప్రజలు కొరుతున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -