Monday, July 28, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్విద్యార్థులకు, టై బెల్టుల వితరణ

విద్యార్థులకు, టై బెల్టుల వితరణ

- Advertisement -

నవతెలంగాణ – జక్రాన్ పల్లి 
మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల తొర్లికొండ పాఠశాల విద్యార్థులకు  సాంబార్ నిత్యశ్రీ జన్మదినం సందర్భంగా వారి తల్లిదండ్రులు సాంబార్ ఉమారాణి నవీన్ లు రూ.5000వేల విలువగల టై, బెల్టులు 100 మంది విద్యార్థులకు అందజేసినట్లు పాఠశాల ఫిజికల్ డైరెక్టర్ మర్కంటి గంగా మోహన్ తెలిపారు.
ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు మరియు మండల విద్యాధికారి మూడెడ్ల శ్రీనివాస్ మాట్లాడుతూ.. పాఠశాల విద్యార్థిని సాంబార్ నిత్యశ్రీ జన్మదిన సందర్భంగా వారి తల్లిదండ్రులు పాఠశాల విద్యార్థులకు టై , బెల్టులు అందించడం వల్ల విద్యార్థులకు విద్యా అవకాశాలు పెంచడంలో భాగమవుతుందన్నారు. ఈ సందర్భంగా నిత్యశ్రీ కి జన్మదిన  శుభాకాంక్షలు, వారి తల్లిదండ్రులకు అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల పిఆర్టియు ప్రధాన కార్యదర్శి రవిన్, పాఠశాల ఉపాధ్యాయులు సాయిలు, రామకృష్ణ, డాక్టర్ నరసింహారావు, సునీత, మాలతి, కృష్ణ, పల్లె గంగాధర్ మరియు ఓఎస్ శేఖర్ లు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -