విద్యార్థులకు ఏకరూప దుస్తుల పంపిణీ..

నవతెలంగాణ – కమ్మర్ పల్లి 
మండలంలోని కోనా సముందర్ జిల్లా పరిషత్ పాఠశాలలలో విద్యార్థులకు ప్రభుత్వం ఉచితంగా సరఫరా చేసిన ఏకరూప  దుస్తుల పంపిణీ చేశారు. ఈ మేరకు బుధవారం పాఠశాలలో  నిర్వహించిన కార్యక్రమంలో మండల పరిషత్ ఉపాధ్యక్షులు కాలేరు శేఖర్ చేతుల మీదుగా విద్యార్థులకు ఏకరూప దుస్తులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వైస్ ఎంపీపీ మాట్లాడుతూ విద్యార్థులు బాగా చదివి భవిష్యత్తులో ఉన్నత శిఖరాలకు చేరుకోవడం ద్వారా కన్న తల్లిదండ్రులతోపాటు గ్రామానికి పేరు ప్రతిష్టలు తీసుకురావాలన్నారు. ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలకు అందించే సౌకర్యాలను వసతులను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ ప్రత్యేక అధికారి, మండల పంచాయతీ అధికారి సదానంద్, గ్రామ పంచాయతీ కార్యదర్శి నవీన్ గౌడ్, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ సభ్యులు, గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.
Spread the love