నవతెలంగాణ – కంఠేశ్వర్ : నగరంలోని మారుతి నగర్ లో గల స్నేహ సొసైటీ ఫర్ రూరల్ రీకన్స్ట్రక్షన్ దివ్యాంగుల పాఠశాలలో రోటరీ క్లబ్ ఆఫ్ జేమ్స్, నిజామాబాద్ ఆధ్వర్యంలో సెరిబ్రల్ పాలసీ దివ్యాంగులకు వీల్ చైర్లను పంపిణీ కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా లోక రమణ్ రెడ్డి, అధ్యక్షుడు, జిల్లా రెవెన్యూ ఉద్యోగుల సంఘం పాల్గొని మాట్లాడుతూ.. స్నేహ సొసైటీ మరియు రోటరీ క్లబ్ లాంటి సంస్థలు, కష్టాల్లో మరియు ఇబ్బందుల్లో ఉన్న వ్యక్తులను, దివ్యాంగులను గుర్తించి వారికి అవసరమైన సేవ చేయడం అభినందనీయం అన్నారు. దివ్యాంగుల పిల్లలకు సేవా భావంతో మరియు అంకితభావంతో, సేవలందిస్తున్న స్నేహ సొసైటీని ఆయన అభినందించారు. నడవడానికి కూడా ఒకరి తోడు అవసరం ఉన్న సెలెబ్రెల్ పాలసీ పిల్లలు సొంతంగా బయటికి కానీ, పాఠశాలకు కానీ వెళ్లడానికి అవసరమైన వీల్ చైర్లను పంపిణీ చేసిన రోటరీ క్లబ్ ఆఫ్ జేమ్స్, నిజామాబాద్ వారికి ఆయన ధన్యవాదాలు తెలియజేశారు. స్నేహ సొసైటీకి ఎలాంటి అవసరాలు ఉన్న తనను సంప్రదించితే వారికి తన సహకారాన్ని అందిస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన పద్మ శ్రీనివాస్ అధ్యక్షుడు రోటరీ క్లబ్ జేమ్స్ నిజామాబాద్ మాట్లాడుతూ.. తాను స్నేహ సొసైటీ సహకారంతో వీల్ చైర్లు అవసరం ఉన్న దివ్యాంగులను గుర్తించి వారికి ఈరోజు వీల్ చైర్లను అందించడం జరిగిందని తెలిపారు. సెలెబ్రెల్ పాల్సి వైకల్యంతో బాధపడుతున్న 8 మంది పాఠశాలల్లో చదువుకునే దివ్యాంగులకు, వీల్ చైర్ లను పంపిణీ చేయడం జరిగింది. రాబోయే రోజుల్లో రోటరీ క్లబ్ ద్వారా స్నేహ సొసైటీలో చదువుకునే దివ్యాంగులకు, సహాయ పరికరాలు అందిస్తామని తెలిపారు. అనంతరం ఎనిమిది మంది సెరెబ్రల్ పాల్సి, దివ్యాంగులకు ముఖ్య అతిథి చేతుల మీదుగా వీల్ ఛైర్లను అందించారు. ఈ కార్యక్రమంలో స్నేహ సోసైటీ కార్యదర్శి, ఎస్ సిద్దయ్య, రోటరీ క్లబ్ ఆఫ్ జేమ్స్,నిజామాబాద్ కార్యదర్శి, గౌరీ శంకర్ స్నేహ సొసైటీ ప్రిన్సిపాల్ జ్యోతి, రోటరీ క్లబ్ జేమ్స్ వ్యవస్థాపకుడు రంజిత్ సింగ్ చౌహన్, రొటేరియన్ చంద్రశేఖర్, దివ్యాంగులు వారి తల్లిదండ్రులు, సిబ్బంది పాల్గొన్నారు.
దివ్యాంగులకు వీల్ చైర్ల పంపిణీ ..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES