Tuesday, May 13, 2025
Homeతెలంగాణ రౌండప్దివ్యాంగులకు వీల్ చైర్స్ పంపిణీ ..

దివ్యాంగులకు వీల్ చైర్స్ పంపిణీ ..

- Advertisement -

నవతెలంగాణ –  కామారెడ్డి: రోటరీ క్లబ్ కామారెడ్డి ఆధ్వర్యంలో దివ్యాంగుల విద్యార్థులకు ఉచితంగా వీల్ చైర్స్ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా క్లబ్ అధ్యక్షులు పి.రాజనర్సింహారెడ్డి  మాట్లాడుతూ రోటరీ క్లబ్ ఆఫ్ కామారెడ్డి , షార్ ప్రాజెక్ట్ వారి ఆర్థిక సహకారంతో రోటరీ క్లబ్ ఆఫ్ జూబ్లీహిల్స్ నార్త్, రోటరీ క్లబ్ ఆఫ్ పిడుగురాళ్ల లైమ్ సిటీ వారి సంయుక్త సౌజన్యంతో 50 వేల రూపాయల విలువ కలిగిన 5 వీల్ చైర్స్ ను దివ్యాంగ విద్యార్థులకు పంపిణీ చేయడం జరిగిందన్నారు.  రోటరీ క్లబ్ అనేక సామాజిక సేవా కార్యక్రమాలు చేపడుతూ విద్యా, వైద్య, ఆర్థిక, సమాజహిత  అనేక కార్యక్రమాలు చేపడు ముందుకు వెళ్తుందని ఇందులో భాగంగా దివ్యాంగులకు ఉచితంగా వీల్ చైర్స్ పంపిణీ చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా రవాణా శాఖ అధికారి కే. శ్రీనివాసరెడ్డి  హాజరై ఆయన మాట్లాడుతూ రోటరీ క్లబ్ ఆఫ్ కామారెడ్డి ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమని, లబ్ధిదారులకు ఉచితంగా కామారెడ్డి క్లబ్ వీల్ చేర్స్ ఇవ్వడం చాల గొప్ప సేవ అని సమాజంలో ప్రతి వ్యక్తి బాధ్యతగా ఇతరులకు సేవ భావతత్పరత కలిగి ఉండాలని, సాటి మనిషికి సహాయం చేయాలని  ఇలాంటి సేవ కార్యక్రమాలు రోటరీ క్లబ్ ఆఫ్ కామారెడ్డి చేపట్టడం గొప్ప విషయమన్నారు. రోటరీ ఇంటర్నేషనల్ స్థాయిలో అనేక కార్యక్రమాలు చేపట్టడం చాలా గొప్ప విషయమని రోటరీ క్లబ్ తమ సేవలు మరింత విస్తృతం చేయాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో  అసిస్టెంట్ గవర్నర్ ఎలెక్ట్ డాక్టర్ ఎం జైపాల్ రెడ్డి, ట్రెజరర్ కృష్ణ హరి, రొటీరియన్స్ సుభాష్ చంద్ జైన్, ఎన్.కాశీనాథం, జి.ధనంజయ, డాక్టర్ బి.బాలరాజ్, బి.నాగభూషణం, వై.శంకర్ టి.సుధాకర్ రావు, పీ.వెంకటరమణ, నవీన్ లబ్ధిదారులు సమత, సాయిలు శెట్టిపల్లి సంగారెడ్డి, కొర్పోలు గ్రామ కాశీరాం,  మనోజ్ మోతే గ్రామం, ఎండి, ఆసిఫ్ ధర్మరావుపేట దివ్యాంగ విద్యార్థులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -