Saturday, April 4, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పిఎన్జిపై సమీక్ష సమావేశం నిర్వహించిన జిల్లా అదనపు కలెక్టర్

పిఎన్జిపై సమీక్ష సమావేశం నిర్వహించిన జిల్లా అదనపు కలెక్టర్

- Advertisement -

నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ 
పిఎన్జి అమలుపై యాదాద్రి భువనగిరి సంబంధిత శాఖల అధికారులతో జిల్లా అదనపు కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో గృహ వినియోగదారులకు పిఎన్జి సరఫరా కోసం పైపులైన్ వేయడం సజావుగా, ఎలాంటి అంతరాయం లేకుండా జరిగేలా అవసరమైన సూచనలు జారీ చేశారు. పనులు వేగవంతంగా పూర్తిచేయడానికి సంబంధిత శాఖల మధ్య సమన్వయం కలిగి పనిచేయాలని అధికారులను ఆదేశించారు. 

ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, నిబంధనలను కచ్చితంగా పాటిస్తూ పనులను సమయానికి పూర్తి చేయాలని తెలిపారు. ఈ  సమావేశం లో భువనగిరి ఆర్డీవో కృష్ణారెడ్డి , జిల్లా పౌర సరఫారాల అధికారి రోజా రాణి, తహశీల్దార్లు, ఏంపిడిఓలు, మున్సిపల్ కమిషనర్ లు, ఏంపి ఓ లు, పంచాయతీ సెక్రెటరీ లు పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -