Thursday, October 9, 2025
E-PAPER
Homeకరీంనగర్స్థానిక ఎన్నికలకు జిల్లా యంత్రాగం సిద్ధం..

స్థానిక ఎన్నికలకు జిల్లా యంత్రాగం సిద్ధం..

- Advertisement -

జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఎం. హరిత..
ఏడు జడ్పీటీసీ స్థానాలు, 65 ఎంపీటీసీ స్థానాలకు మొదటి విడతలో ఎన్నికలు..
ఎంపీడీఓ కార్యాలయాల్లో ఏర్పాట్ల పరిశీలన..
నవతెలంగాణ – వేములవాడ 

రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ ఆదేశాల మేరకు జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహించేందుకు యంత్రాంగం సిద్ధంగా ఉందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఎం. హరిత తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో వేములవాడ అర్బన్, వేములవాడ రూరల్, బోయినిపల్లి, చందుర్తి ఎంపీడీఓ కార్యాలయాల్లో, రుద్రంగి గ్రామపంచాయతీ కార్యాలయంలో నామినేషన్ల స్వీకరణకు చేసిన ఏర్పాట్లను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ గురువారం పరిశీలించారు. 

ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ మాట్లాడారు. రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ సెప్టెంబర్ 29 వ తేదీన షెడ్యూల్ విడుదల చేసిందని వెల్లడించారు. ఇందులో భాగంగా జిల్లాలో మొదటి విడతలో ఏడు జడ్పీటీసీలు స్థానాలు, 65 ఎంపీటీసీ స్థానాలకు నామినేషన్లు స్వీకరిస్తామని తెలిపారు. ఎంపీడీఓ కార్యాలయాల్లో నామినేషన్ల స్వీకరణకు చేసిన హెల్ప్ డెస్క్ లు, ఇతర ఏర్పాట్లను పరిశీలించామని వివరించారు.

ఇప్పటికే ఎన్నికల నేపథ్యంలో ఆర్ఓ, ఏఆర్ఓలకు శిక్షణ ఇచ్చామని తెలిపారు. ఎన్నికలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేశామని, జోనల్, మండల ఆఫీసర్లు, ఎంసీసీ నోడల్ ఆఫీసర్లు, ఎఫ్ ఎస్ టీ, ఎస్ఎస్ టీ టీంలను నియమించి శిక్షణ పూర్తి చేశామని పేర్కొన్నారు. ఎఫ్ ఎస్ టీ, ఎస్ఎస్ టీ టీంలను విధులు నిర్వర్తిస్తున్నాయని తెలిపారు. అన్ని ఆర్ఓ కార్యాల యాల్లో ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల సహాయార్థం హెల్ప్ డెస్క్ లు ఏర్పాటు చేయాలని, ఎన్నికకు సంబంధించిన పూర్తి సమాచారం అందుబాటులో పెట్టాలని, నామినేషన్ల స్వీకరణ ఇతర వివరాలు తెలిపే బోర్డులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

గ్రామ పంచాయతీ ఎన్నికలు జిల్లాలో రెండు, మూడో విడతలో నిర్వహించనున్నట్లు వెల్లడించారు. దానికి సంబంధించిన ఏర్పాట్లు పూర్తి చేశామని పేర్కొన్నారు. పీఓ, ఏపీఓలకు ఇప్పటికే ఒక విడత శిక్షణ ఇచ్చామని, మరో విడత ఇస్తామని కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో వేములవాడ ఆర్డీవో రాధాభాయ్, ఆయా మండలాల ఎంపీడీఓలు, తహసీల్దార్లు, ఎంపీఓలు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -