Thursday, October 9, 2025
E-PAPER
Homeఖమ్మంపామాయిల్ మొక్కల పెంపుకు సన్నాహాలు

పామాయిల్ మొక్కల పెంపుకు సన్నాహాలు

- Advertisement -

– సౌకర్యాలు పరిశీలించిన పీఈక్యూ నిపుణుల బృందం 
– అక్టోబర్ చివరినాటికి విత్తనాలు నాటుతాం : ఆయిల్ఫెడ్ ఓఎస్డీ కిరణ్ కుమార్
నవతెలంగాణ – అశ్వారావుపేట
రెండేళ్ల విరామం తర్వాత పామాయిల్ మొక్కల పెంపకానికి ఆయిల్‌ఫెడ్ సన్నాహాలు ప్రారంభించింది. ఈ క్రమంలో విత్తనాలు నాటడానికి అవసరమైన సౌకర్యాలను పీఈక్యూ (పోస్ట్ ఎంట్రీ క్వారంటైన్) నిపుణుల బృందం గురువారం పరిశీలించింది. అశ్వారావుపేట మండలం నారంవారిగూడెం పరిధిలోని ఆయిల్‌ఫెడ్ డివిజనల్ కార్యాలయం ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కేంద్రీయ పామాయిల్ నర్సరీ లో షేడ్ నెట్ (నీడ పందిరి) సదుపాయాన్ని డీఓ రాధాకృష్ణ సిద్ధం చేశారు.

ఈ సందర్భంగా క్వారంటైన్ నిపుణులు విత్తనాలు నాటే సదుపాయాలు, వాతావరణ పరిస్థితులు తదితర అంశాలను పరిశీలించారు. బృందంలో ఆయిల్ ఫెడ్ ఓపీడీ మేనేజర్ ప్రవీణ్ రెడ్డి, ఓఎస్డీ అడపా కిరణ్ కుమార్, ఉద్యాన శాస్త్రవేత్త (పాథాలజీ) విద్యాసాగర్, క్వారంటైన్ నిపుణుడు వెంకటరెడ్డి పాల్గొన్నారు.

తరువాత ప్రవీణ్ రెడ్డి, కిరణ్ కుమార్ లు మాట్లాడుతూ.. “అక్టోబర్ చివరినాటికి పామాయిల్ విత్తనాలు నాటుతాం అన్నారు. 2026 – 27 ఆర్థిక సంవత్సరానికి గాను తొలి దఫా గా 4 లక్షల 50 వేల మొక్కలు పెంచేందుకు ఏర్పాట్లు పూర్తి చేస్తున్నాం” అని తెలిపారు.రైతులకు నాణ్యమైన మొక్కలు అందించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం అన్నారు. ఈ కార్యక్రమంలో ఆయిల్ఫెడ్ ఖమ్మం డీఓ సబావత్ శంకర్,స్థానిక క్షేత్రస్థాయి సిబ్బంది మహేష్, అశోక్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -