Sunday, August 24, 2025
E-PAPER
spot_img
Homeఆదిలాబాద్ప్రభుత్వ భూములు ఆక్రమణలపై జిల్లా యంత్రాంగం తక్షణ చర్యలు...   

ప్రభుత్వ భూములు ఆక్రమణలపై జిల్లా యంత్రాంగం తక్షణ చర్యలు…   

- Advertisement -

నవతెలంగాణ -ముధోల్
 ముధోల్ మండలం బోరిగాం గ్రామంలోని సర్వే నంబరు 249లో ఇటీవల కొందరు వ్యక్తులు ప్రభుత్వ భూమిని అక్రమంగా ఆక్రమించేందుకు యత్నించిన విషయం వెలుగులోకి రావటంతో ఈ సమాచారాన్ని అందుకున్న రెవెన్యూ శాఖ అధికారులు తక్షణమే స్పందించి, సంబంధిత భూమి హద్దులను గుర్తించటం జరిగింది. అని నిర్మల్ జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్  శుక్రవారం ఓక్క ప్రకటనలో తెలిపారు. అనంతరం ఆక్రమణలను తొలగిస్తూ, అవసరమైన చర్యలు చేపట్టారని   పేర్కొన్నారు. బోరిగాం  ఘటన నేపథ్యంలో రెవెన్యూ, ల్యాండ్ సర్వే విభాగాలకు చెందిన అధికారులతో కూడిన ఉన్నత స్థాయి కమిటీని జిల్లా యంత్రాంగం నియమించిందిని కలెక్టర్ తెలిపారు.ప్రస్తుతం ఆ కమిటీ విచారణ కొనసాగిస్తున్నట్లు కలెక్టర్ పేర్కొన్నారు. భవిష్యత్తులో ఇటువంటి అక్రమాలు చోటుచేసుకోకుండా నివారించేలా జిల్లా యంత్రాంగం పటిష్టమైన చర్యలు చేపడుతుందని తెలిపారు. అయితే ఈ వ్యవహారంలో కొంతమంది వ్యక్తులు శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా అసత్య ప్రచారాలు, పుకార్లు వ్యాప్తి చేయడానికి యత్నిస్తున్నట్లు గుర్తించిన్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు.  ప్రజలు ఎవరు  అసత్య ప్రచారాలు, పుకార్లను నమ్మవద్దుఅని కలెక్టర్ కోరారు.బోరిగాం గ్రామ ప్రజలందరికీ జిల్లా యంత్రాంగం పూర్తి అండగా నిలుస్తోందని తెలిపారు‌. ‌‌ఎక్కడా ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం కాకుండా ఉండేలా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ ప్రకటనలో స్పష్టం చేశారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad