Thursday, May 22, 2025
Homeతెలంగాణ రౌండప్వలస కార్మికులను సొంత ఊర్లకు పంపించిన జిల్లా సహాయ కర్మిక శాఖ అధికారి

వలస కార్మికులను సొంత ఊర్లకు పంపించిన జిల్లా సహాయ కర్మిక శాఖ అధికారి

- Advertisement -

నవతెలంగాణ –  కామారెడ్డి
 తేది 21-5-2025 రోజున వచ్చిన ఫిర్యాదు మేరకు కామారెడ్డి మండలం గూడెం గ్రామ శివారులో గల కె కె ఎస్   ఇటుక బట్టి  నీ  తనిఖీ చేయడం జరిగిందనీ జిల్లా సహాయ కర్మిక శాఖ అధికారి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆ ఇటుక బట్టీలో  అంతరాష్ట్ర వలస కార్మికులను పన్నెండు మంది ఒరిస్సా కార్మికులను గుర్తించడం జరిగింది. వారిని విదారించగా మేము మా స్వంత గ్రామాలకు వేల్లదానికి గాను ఫిర్యాదు చేయడమైనదని తెలిపారు. యజమానిని విచారించగా తానూ వారిని తిరిగి వాళ్ళ సొంత గ్రామాలకు  పంపాడని సిద్ధంగా వున్నానని తెలిపారు. కార్మికులకు రావాల్సిన మిగిలిన జీతబత్యాలు యజమాని నుండి ఇప్పించి కార్మికులను తమ స్వంత గ్రామాలకు తిరిగి పంపించమైనదన్నారు. కేకేఎస్ ఇటుక బట్టి యజమానిపై అంతరాష్ట్ర వలస కార్మికుల చట్టం క్రింద చర్యలు తీస్కోవడమైనది. అట్టి ఇటుక బట్టి కార్యకలాపాలు నిలిపి వేయాలని అదేశించనైనది. దీనిలో సహయ కార్మిక కమిషనర్, కామారెడ్డి, సహాయ కర్మిక అధికారి, కామారెడ్డి, తాసిల్దార్ జనార్ధన్,  సబ్ ఇన్స్పెక్టర్ అఫ్ పోలీసు, దేవునిపల్లి, జిల్లా బాలల పరిరక్షణ అధికారిని స్రవంతి తదితర అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -