Wednesday, July 2, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్జిల్లా అప్రోప్రియేట్ అథారిటీ కమిటీ సమావేశం…

జిల్లా అప్రోప్రియేట్ అథారిటీ కమిటీ సమావేశం…

- Advertisement -

– డాక్టర్లకు శుభాకాంక్షలు తెలిపిన జిల్లా కలెక్టర్…
నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ 
 జిల్లాలో పిసి అండ్ పి ఎన్ డి టి   చట్టం 1994 అమలుపై ఎం హనుమంతరావు, జిల్లా కలెక్టర్  అధ్యక్షతన జిల్లా అప్రోప్రియేట్ అథారిటీ సమావేశం  కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా అప్రోప్రియేట్ అథారిటీ కమిటి సభ్యులైన  ప్రిన్సిపల్ జిల్లా & సెషన్స్ జడ్జి జయరాజు, భాస్కర్ రావు, అడిషనల్ కలెక్టర్ (లోకల్ బాడీ) , అడిషనల్ డీసీపీ భువనగిరి సియచ్ లక్ష్మి నారాయణ, జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి డా. ఎం మనోహర్, డా. యల్ యశోద, ప్రోగ్రాం అధికారి, స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి డా. బి. ప్రమీల  తో సమీక్షా సమావేశం నిర్వహించారు. 

ఈ సమావేశంలో ప్రధానంగా జిల్లాలో పిసి & పి ఏన్ డి టి చట్టం అమలుపై, ఐ ఈ సి మెటీరియల్‌ ద్వారా లింగ నిర్ధారణ, అక్రమ గర్భస్రావాల నివారణకు స్కూల్లు, కాలేజీల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని  తెలియచేసారు. లింగ నిర్ధారణ, అక్రమ గర్భస్రావాల నివారణకు జిల్లా స్థాయిలో హెల్ప్‌లైన్ నంబర్ 8074261809 ప్రారంభించడం జరిగిందనారు. 

 జిల్లా లో ఎవరైనా లింగ నిర్ధారణ, అక్రమ గర్భస్రావాల తీసినట్లు ఐతే జిల్లా స్థాయిలో హెల్ప్‌లైన్ నంబర్ పిర్యాదు పిర్యాదు చేయగలరని తలియచేసారు. జిల్లాలో 2020 నుండి 2025 మధ్య 5 సంవత్సరాల గణాంకాల ఆధారంగా మండలాల వారీగా బాలబాలికల జనన నిష్పత్తిపై సమీక్ష నిర్వహించారు. లింగ నిష్పత్తి మెరుగుపరచడానికి అవసరమైన చర్యలు, అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని. జిల్లాలో నూతన స్కానింగ్ సెంటర్లకు అనుమతి, పునర్నవీకరణ, సవరణలకు సంబంధించిన దరఖాస్తుల పరిశీలించడం జరిగిందని, మార్చి మూడవ తేదీన జరిగిన రాష్ట్ర స్థాయి సూపర్వైజరీ బోర్డు సమావేశ నిర్ణయాలపై జిల్లాలో తీసుకోవలసిన అనుసరణ చర్యలపై కూడా ఈ సమావేశంలో చర్చించనున్నట్లు, షోకాజ్ నోటీసులపై చర్యలు తీసుకొని కోర్టు కేసులుగా మార్చే దిశగా వేగవంతమైన చర్యలు తీసుకోవాలని సూచించారు.

మండలాల వారీగా గర్భిణీ మహిళల ఏ ఏన్ సి ట్రాకింగ్, ఆయా మండలాల్లో ( ఎక్స్పెక్టెడ్ డేట్ అఫ్ డెలివరీ ) కి రాకుండా ఉన్న మహిళల వివరాలు సమీక్షించనున్నారు.  ఇంటెలిజెంట్ రిస్క్ అనాలిసిస్ ఆధారంగా రిజిస్ట్రేషన్ లేని కేసుల గుర్తింపు చేపట్టాలన్నారు. ప్రతి జిల్లాలో వాట్సాప్ ఆధారిత ఫిర్యాదు వ్యవస్థను ఏర్పాటు చేయాలి. ప్రజలకు చట్టంపై అవగాహన పెంచే దిశగా ఇది ఉపయుక్తంగా ఉంటుంది. జిల్లా అడ్వైజరీ కమిటీ సమావేశాల నివేదికలను రాష్ట్ర అధికారులకు సమర్పించాలనే అంశం కూడా చర్చించారు. జిల్లా లో ఉన్న ప్రైవేటు, ప్రభుత్వ స్కానింగ్ సెంటర్ గైనకాలజిస్ట్, రేడియాలజిస్ట్ పి.సి & పి.యన్.డి.టి ఆక్ట్, స్కానింగ్ సెంటర్ల నిర్వహణపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించాలని తెలియజేశారు. ప్రతి నెల స్కానింగ్ సెంటర్ల ని తనిఖి చేసి ఫారం – యఫ్ ఆడిట్ చేయాలన్నారు, జిల్లా లో లింగ నిష్పత్తిని వ్యత్యసాన్ని తగ్గించలన్నారు. జిల్లా లో డెకయ్ ఆపరేషన్లు చేయాలన్నారు. ఎవరైనా లింగ నిర్ధారణ పరిక్షలు నిర్వహిస్తే పి.సి & పి.యన్.డి.టి ఆక్ట్ ప్రకారం కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.  డాక్టర్స్ డే సందర్భంగా జిల్లా కలెక్టర్ హనుమంతరావు డాక్టర్లకు శుభాకాంక్షలు తెలిపారు.  కేకు కట్ చేసి డాక్టర్లకు శుభాకాంక్షలు తెలిపారు.  ఈ సమావేశంలో డా. సాయి శోభ, డా. శిల్పిని,  వి అంజయ్య,   వసంత కుమారి, వైద్య ఆరోగ్య సిబ్బంది  పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -