- Advertisement -
నవతెలంగాణ- దుబ్బాక
వినూత్న కార్యక్రమాలతో పాఠశాలకు ప్రత్యేక గుర్తింపును తేవడమే కాకుండా విద్యార్థుల సంఖ్యను పెంపుదల చేసినందుకు గాను అక్బర్ పేట భూంపల్లి మండల పరిధిలోని రామేశ్వరంపల్లి జడ్పీహెచ్ఎస్ కి చెందిన ఉపాధ్యాయుడు నీలం శ్రీనివాస్ కు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు దక్కింది. ఈ సందర్భంగా శనివారం సిద్దిపేటలోని టీటీసీ భవన్ లో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య, జిల్లా కలెక్టర్ హైమావతి, అడిషనల్ కలెక్టర్ గరీమా అగ్రవాల్ చేతులమీదుగా ఆయన ఈ అవార్డును అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయన డీఈవో శ్రీనివాస్ రెడ్డి, ఎంఈఓ అంజయ్య, పాఠశాల ఉపాధ్యాయ బృందానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
- Advertisement -