Friday, January 23, 2026
E-PAPER
Homeఆదిలాబాద్అమ్మవారిని దర్శించుకున్న జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్

అమ్మవారిని దర్శించుకున్న జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్

- Advertisement -

నవతెలంగాణ -ముధోల్
చదువుల తల్లి కొలువై ఉన్న బాసర శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానంలో శుక్రవారం వసంత పంచమి వేడుకలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. వసంత పంచమి సందర్భంగా జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ తన కుటుంబ సభ్యులతో కలిసి శుక్రవారం తెల్లవారుజామున అమ్మవారిని దర్శించుకున్నారు. కలెక్టర్ తన కుమార్తెకు ఆలయ మండపంలోశాస్త్రోక్తంగాఅక్షరాభ్యాస కార్యక్రమంనిర్వహించారు. జ్ఞాన సరస్వతి అమ్మవారిని కలెక్టర్ దర్శించుకుని ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు కలెక్టర్ దంపతులకు వేద ఆశీర్వచనాలు అందించి, అమ్మవారి తీర్థప్రసాదాలను అందజేశారు. దర్శనం అనంతరం కలెక్టర్ ఆలయ క్యూలైన్లను పరిశీలించారు.

క్యూలైన్లలో వేచి ఉన్న భక్తులతో నేరుగా మాట్లాడి, దర్శన ఏర్పాట్లపై ఆరా తీశారు. ముఖ్యంగా చిన్న పిల్లలతో వచ్చే భక్తులకు పాలు, తాగునీరు సక్రమంగా అందుతున్నాయా లేదా అని విషయం అడిగి తెలుసుకున్నారు. భక్తులకు ఎక్కడా అసౌకర్యం కలగకుండా చూడాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. వసంత పంచమి పర్వదినం సందర్భంగా రాష్ట్రం నలుమూలల నుండి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని శాఖల సమన్వయంతో పకడ్బందీ ఏర్పాట్లు చేశామని, భక్తులు ప్రశాంత వాతావరణంలో అమ్మవారిని దర్శించుకుని వెళ్లేలా చర్యలు తీసుకోవడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలోఆలయకార్యనిర్వహణాధికారి అంజనా దేవి, తహసిల్దార్ పవన్ చంద్ర, వివిధ శాఖల అధికారులు, ఆలయ సిబ్బంది తదితరులు, పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -