Wednesday, September 3, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్చందుపట్ల పాఠశాల తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్...

చందుపట్ల పాఠశాల తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్…

- Advertisement -

నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ : భువనగిరి మండలంలోని చందుపట్ల గ్రామంలో గల జిల్లా పరిషత్ హై స్కూల్ యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు సోమవారం ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. స్కూల్ లో ఎంత  మంది టీచర్స్ విధులకు హాజరయ్యారని, ఈరోజు ఎంతమంది  విధులకు హాజరు అయ్యారని, ఎంత మంది హబ్సెంట్ అయ్యారు రిజిస్టర్ ను పరిశీలించారు. పదవ తరగతి లో  విద్యార్థుల సంఖ్య  ఎంతమంది  ఉన్నారని అని అడిగి తెలుసుకున్నారు. 10 వ తరగతి చదువుతున్న విద్యార్థులతో కలెక్టర్ మాట్లాడారు. రోజు భోజనం బాగుంటుందా, మెనూ ప్రకారం పెడుతున్నారా లేదా అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు.

గణితం లో విద్యార్థుల చేత లెక్కలు చేయించారు. విద్యార్థుల యొక్క సామర్ధ్యాలను రావట్టారు. రోజు విద్యార్థులకు గణితం లెక్కలు అర్థం అయ్యేలా చెప్పడంతో పాటు రోజు బోర్డ్ మీద లెక్కలు వేసి ప్రాక్టీస్ చేయిస్తున్న మ్యాథ్స్ టీచర్ యాదగిరి ని సన్మానించారు.ఈ స్కూల్ లో  నైపుణ్యం కలిగిన ఉపాధ్యాయులు ఉన్నారని , విద్యార్థులు ఆడుకోవడానికి   గ్రౌండ్ కూడా ఉందని,ప్రైవేట్ స్కూల్ లో  ఇలాంటి సౌకర్యాలు లేవన్నారు. కాబట్టి విద్యార్థులు కూడా మీ గ్రామంలో తోటి విద్యార్థులకు ప్రభుత్వ పాఠశాలల్లో జాయిన్ అయ్యేలా చూడాలని సూచించారు టీచర్లు కూడా గ్రామంలో పిల్లల తల్లిదండ్రులతో మాట్లాడి ప్రభుత్వ పాఠశాలలో అడ్మిషన్ పెరిగేలా చూడాలి అన్నారు. విద్యార్థి దశ చాలకి కీలకమైందని ఇప్పుడు ఎంత కష్టపడితే భవిష్యత్తు అంతా బాగుంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad