Thursday, February 26, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఎస్ ఆర్ ఫౌండేషన్ సేవలను ప్రశంసించిన జిల్లా కలెక్టర్

ఎస్ ఆర్ ఫౌండేషన్ సేవలను ప్రశంసించిన జిల్లా కలెక్టర్

- Advertisement -

–  సీఎం కప్ విజేతలకు అభినందనలు
–  కామారెడ్డి కలెక్టరేట్‌లో అభినందన కార్యక్రమం
నవతెలంగాణ – కామారెడ్డి

కామారెడ్డి జిల్లాలో సేవా కార్యక్రమాలతో ముందంజలో ఉన్న ఎస్ ఆర్ ఫౌండేషన్ సేవలను జిల్లా కలెక్టర్ ప్రశంసించారు. గురువారం కామారెడ్డి కలెక్టరేట్‌లో నిర్వహించిన కార్యక్రమంలో సీఎం కప్ రాష్ట్రస్థాయి పోటీల్లో విజేతలైన బిబిపేట మండల కరాటే విద్యార్థులను ప్రత్యేకంగా అభినందించారు. రాష్ట్రస్థాయిలో మెరిసిన కరాటే విద్యార్థులు డాకూరి రోహిత్, మైనస్ 63 కేజీల విభాగంలో బ్రౌన్స్ పతకం, చిట్టబోయిన వంశీ, సిల్వర్ పతకం సాధించిన వారిని అభినందించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, లాభాపేక్ష లేకుండా విద్యార్థుల అభివృద్ధికి, క్రీడలకు, సామాజిక సేవా కార్యక్రమాలకు ఆర్థిక సహాయం అందిస్తూ ఎస్ ఆర్ ఫౌండేషన్ చేస్తున్న సేవలు అభినందనీయమని పేర్కొన్నారు. గ్రామానికి మాత్రమే పరిమితం కాకుండా ఇతర ప్రాంతాల్లో  సేవా కార్యక్రమాలు నిర్వహించడం ప్రశంసనీయమన్నారు. భవిష్యత్తులో  మరిన్ని సేవా కార్యక్రమాలు చేయాలనీ, పేదలకు మరింతగా సేవలు అందిస్తూ, విద్యార్థుల ప్రతిభను ప్రోత్సహించాలన్నారు. సమాజానికి ఆదర్శంగా నిలిచే విధంగా ఫౌండేషన్ ముందుకు సాగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) విట్టర్, జనగామ గ్రామ సర్పంచ్ మట్ట శ్రీనివాస్, బిబిపేట మండల మాజీ వైస్ ఎంపీపీ కప్పరా రవీందర్ రెడ్డి, మాందాపూర్ సర్పంచ్ హరీష్, కుమ్మరి ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -