– విద్యార్ధులు నమోదు పెంచాలని ఆదేశం
నవతెలంగాణ – అశ్వారావుపేట
అశ్వారావుపేట కాంప్లెక్సు పరిధిలోని పేటమాలపల్లి, నాల్గవతరగతి ఉద్యోగుల కాలనీ ప్రాధమిక పాఠశాలలను జిల్లావిద్యాధికారిణి బి.నాగలక్ష్మి మంగళవారం ఆకస్మికంగా సందర్శించారు. విద్యార్ధుల సామర్ధ్యాలను ఎఫ్.ఎల్.యస్ నిర్వహణను, మధ్యాహ్నభోజన రికార్డులను, గ్రంధాలయ నిర్వహణను పరిశీలించారు. విద్యార్ధులతో పాఠ్యాంశాలను చదివించి గణిత ప్రక్రియలపై ప్రశ్నలడిగి విద్యార్ధులు చెప్పిన సమాధానాలకు సంతృప్తి వ్యక్తం చేశారు.
హాజరు శాతం పెంచాలని, వెనుకబడిన విద్యార్ధుల పై ప్రత్యేక శ్రద్ధ వహించి వారి సామర్ధ్యాలను పెంపొందించుటకు ప్రత్యేక ప్రణాళికలను రూపొందించుకోవాలని అన్నారు.ఉపాధ్యాయుల పనితీరు సంతృప్తికరంగా ఉందని అన్నారు.ఆమె వెంట యం.పి.డి.ఒ అప్పారావు, ఎంఈఓ ప్రసాదరావు,కాంప్లెక్సు ప్రధానోపాధ్యాయురాలు పి.హరిత,సి.ఆర్.పి ప్రభాకరాచార్యులు ఉన్నారు. ప్రభాకరాచార్యులు సంపాధకత్వంలో ప్రచురించిన బడి పిల్లల కథలు మధురోహలు పుస్తకాన్ని బహూకరించగా బాల సాహిత్యాన్ని ప్రోత్సహించడం అభినందనీయమని అన్నారు.



