నవతెలంగాణ – ఆర్మూర్
జిల్లా ఎస్జీఎఫ్ సెక్రటరీ శ్రీమతి నాగమణి ఆధ్వర్యంలో శుక్రవారం పట్టణంలో మినీ స్టేడియం నందు ఎస్జిఎఫ్ఐ 17 సంవత్సరాల బాల బాలికల జిల్లా జట్ల హాకీ సెలక్షన్స్ నిర్వహించడం జరిగిందని, జిల్లా హాకీ అసేసియేషన్ కార్యదర్శి సదామస్తుల రమణ తెలిపారు. బాలురు దాదాపుగా 80 బాలురు, 65బాలికలు ఇందులో పాల్గొనడం జరిగింది. ఇందులో నుండి తుది జట్టుకు 18 మంది క్రీడాకారులను మాత్రమే ఎంపిక చేశారని తెలియజేశారు. ఈ యొక్క ముగింపు కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసి క్రీడాకారులను ఉద్దేశించి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాలలో ఇస్తున్నటువంటి 2% స్పోర్ట్స్ కోటాను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఫిజికల్ డైరెక్టర్స్ స్వప్న, స్వామి, చిన్నయ్య, నాగేష్, బి రాజేశ్వర్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
మినీ స్టేడియంలో జిల్లా హాకీ జట్ల ఎంపికలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



