Saturday, February 21, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంజిల్లాస్థాయి అక్రిడిటేషన్‌ కమిటీలను వారంరోజుల్లో పూర్తిచేయాలి

జిల్లాస్థాయి అక్రిడిటేషన్‌ కమిటీలను వారంరోజుల్లో పూర్తిచేయాలి

- Advertisement -

ఐ అండ్‌ పీఆర్‌ స్పెషల్‌ కమిషనర్‌ ప్రియాంక

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
జిల్లాస్థాయి అక్రిడిటేషన్‌ కమిటీలను వారం రోజుల్లో పూర్తి చేయాలని డీపీఆర్వోలను సమాచార పౌర సంబంధాల శాఖ స్పెషల్‌ కమిషనర్‌ సి.హెచ్‌.ప్రియాంక ఆదేశించారు. శుక్రవారం హైదరాబాద్‌ నాంపల్లిలోని తెలంగాణ మీడియా అకాడమీ ఆడిటోరియంలో అక్రిడిటేషన్‌ కార్డుల జారీ ప్రక్రియ విధి విధానాలపై డీపీఆర్వోలకు, క్షేత్రస్థాయి సిబ్బందికి శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, జి.ఓ.నెం.252, 103లపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని డీపీఆర్వోలకు సూచించారు. జిల్లా స్థాయి అక్రిడిటేషన్‌ కమిటీలను సంబంధిత జిల్లా కలెక్టర్లతో సమన్వయం చేసుకుని స్థానిక ప్రింట్‌ అండ్‌ ఎలక్ట్రానిక్‌ ప్రతినిధులతో ఒక కమిటీని వారం రోజుల్లో పూర్తి చేయాలని ఆమె వెల్లడించారు.

ప్రింట్‌, ఎలక్ట్రానిక్‌, డిజిటల్‌ మీడియా, ఫ్రీలాన్స్‌, వెటరన్‌ జర్నలిస్టుల అక్రిడిటేషన్‌ కార్డుల నమోదు, దరఖాస్తుల పరిశీలన, రిపోర్టులు, అప్రూవ్‌డ్‌ లిస్టులు, రిజిస్ట్రేషన్‌ నెంబర్‌ అలాట్‌మెంట్‌, అక్రిడిటేషన్‌ కార్డుల డౌన్‌లోడ్‌ తదితర అంశాలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని ఆమె సంబంధిత అధికారులను కోరారు. అదే విధంగా అక్రిడిటేషన్‌ కార్డుల ప్రక్రియలో భాగంగా ఆన్‌లైన్‌, ఇతర సమస్యలు తలెత్తితే వెంటనే రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో మీడియా రిలేషన్‌ వింగ్‌ అధికారులతో ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకోవాలని సూచించారు. సాంకేతిక సమస్యలు ఉంటే టెక్నికల్‌ టీమ్‌ ప్రధాన కార్యాలయంలో అందుబాటులో ఉంటారని వారిని కూడా సంప్రదించి ఎలాంటి తప్పులకు ఆస్కారం లేకుండా అక్రిడిటేషన్‌ ప్రక్రియ పూర్తి పారదర్శకంగా నిర్వహించాలని అధికారులను ఆమె కోరారు.

తెలంగాణ మీడియా అకాడమీ చైర్మెన్‌ కె.శ్రీనివాస్‌ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయిలో అక్రిడిటేషన్‌ కార్డులను జారీ చేయాలని డీపీఆర్వోలను ఆయన కోరారు. క్షేత్రస్థాయిలో అక్రిడిటేషన్‌ జారీలో ఏమైన సమస్యలు ఉంటే స్పెషల్‌ కమిషనర్‌ దృష్టికి తీసుకురావాలని ఆయన సూచించారు. ఈ శిక్షణా కార్యక్రమానికి రాష్ట్రం లోని 33 జిల్లాల డీపీఆర్వోలు, సంబంధిత సిబ్బంది హజరయ్యారు. శిక్షణలో భాగంగా క్షేత్రస్థాయి సిబ్బంది లేవనెత్తన అంశాలపై మీడియా రిలేషన్‌ విభాగం అధికారులు డి.ఎస్‌.జగన్‌, యామిని, వెబ్‌సైట్‌ టీమ్‌ మేనేజర్‌ నంద, టెక్నీషియన్‌ సాయిలు సందేహాలను నివృత్తి చేశారు. అర్హత గల జర్నలిస్టులు http://ipr.telangana.gov.in ద్వారా ఆన్‌లైన్లో దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. ఏమైనా సందేహాలు ఉంటే సెల్‌ నెం.: 9154170881ను సంప్రదించాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సమాచార పౌర సంబంధాల శాఖ అదనపు సంచాలకులు డి.ఎస్‌. జగన్‌, తెలంగాణ మీడియా అకాడమి కార్యదర్శి నాగులపల్లి వెంకటేశ్వర రావు, జాయింట్‌ డైరెక్టర్లు శ్రీనివాస్‌, రమణ, మధుసుదన్‌, జాయింట్‌ డైరెక్టర్లు వై. వెంకటేశ్వర్లు, హష్మీ, రాజారెడ్డి, అసిస్టెంట్‌ డైరెక్టర్‌ యామిని, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -