హిందీ భాష సేవా సమితి జిల్లా అధ్యక్షులు సుకుమార్ పేట్కులే
నవతెలంగాణ – ఆదిలాబాద్ టౌన్
రాష్ట్ర భాష హిందీ దినోత్సవాన్ని పురస్కరించుకొని 16న మంగళవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరం ఆదిలాబాద్ లో జరిగే హిందీ పర్వ్- 2025 కార్యక్రమంలో హిందీ భాష ప్రేమికులు, హిందీ ఉపాధ్యాయులు, విద్యార్థిని విద్యార్థులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని హిందీ భాష సేవా సమితి జిల్లా అధ్యక్షులు సుకుమార్ పేట్కులే పిలుపునిచ్చారు. సోమవారం ఆయన హిందీ భాష సేవాసమితి జిల్లా ప్రధాన కార్యదర్శి దత్తాత్రేయ ద్రోణాలే లతో కలిసి ఆదిలాబాద్ పార్లమెంటు సభ్యులు గోడం నగేష్ ,జిల్లా కలెక్టర్ రాజర్షి షా, అదనపు కలెక్టర్ శ్యామలాదేవి, జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఆకాశవాణి కేంద్ర డైరెక్టర్ రామేశ్వర్ లను వారి వారి కార్యాలయాల్లో కలిసి పోస్టర్లను విడుదల చేయించి కార్యక్రమానికి హాజరు కావలసిందిగా ఆహ్వానించారు.
దానికి స్పందించిన రాజకీయ నేతలు, జిల్లా అధికారులు జాతీయ భాష భాష సేవ కై హిందీ భాష సేవా సమితి సభ్యులు కంకణ బద్ధులై గొప్ప కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని జాతీయ భాష హిందీ సేవ చేయడం అందరి కర్తవ్యమని ,తప్పకుండా కార్యక్రమానికి హాజరవుతారని తెలిపినట్లు అన్నారు. కాగా ఉదయం 10:30 గంటల నుండి విద్యార్థులకు వ్యాసరచన, చిత్రలేఖనం , ఉపన్యాస, పాటల, నృత్య పోటీలు ఉంటాయని దాదాపు 50 పాఠశాలల నుండి విద్యార్థిని విద్యార్థులు హిందీ ఉపాధ్యాయులు హాజరవుతున్నారని సుకుమార్ పెట్కులే తెలిపారు. అలాగే ఈ కార్యక్రమానికి హాజరయ్యే హిందీ ఉపాధ్యాయులందరికీ జిల్లా కలెక్టర్ రాజర్షి షా ఐటీడీఏ పీవో ఆదిలాబాద్ విద్యాశాఖ అధికారిని శ్రీమతి కుశుబు గుప్తా లు ఆన్ డ్యూటీ సౌకర్యం కల్పిస్తున్నట్లు తెలిపారు.
అలాగే మధ్యాహ్నం 12 గంటల నుండి ఒంటిగంట మధ్యలో హిందీ భాష సేవా సమితి కార్యవర్గ కాల పరిమితి రెండు సంవత్సరాలు ముగిసినందున నూతన కమిటీని కూడా ఏర్పాటు చేస్తామని తెలిపారు. మధ్యాహ్నం రెండు గంటల నుండి సాంస్కృతిక, భాషా సాహితి కార్యక్రమాలు ఉంటాయని హిందీ సాహితీవేత్తలను, హిందీ ఉత్తమ ఉపాధ్యాయులను ఈ సందర్భంగా సన్మానించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్యవర్గ సభ్యులు పండరినాథ్ ఏ. చంద్రశేఖర్, అశోక్, కే. ప్రథమ్ కానిందే అశోక్ పి .మహేష్ పాల్గొన్నారు.
రేపు జిల్లా స్థాయి హిందీ దినోత్సవ వేడుకలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES