నవతెలంగాణ – కామారెడ్డి
కామారెడ్డి జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ కార్యాలయంలో జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ విద్య అధ్యక్షతన, ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ ఎమీమ్ ఆధ్వర్యంలో మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ (Medical Termination of Pregnancy) పై శుక్రవారం జిల్లా కమిటీ సమావేశం నిర్వహించబడింది. ఈ సమావేశంలో జిల్లా పరిధిలోని ప్రైవేట్ ఆసుపత్రులలో ఎంటిపీ అమలు, నిబంధనలు, అనుమతులపై విస్తృతంగా చర్చించి, అవసరమైన సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. జిల్లా కార్యాలయం నుండి ప్రత్యేక అనుమతి లేకుండా ఏ ప్రైవేట్ ఆసుపత్రి కూడా ఎంటిపీ ప్రక్రియను నిర్వహించరాదు. అనుమతి లేకుండా ఎంటిపీలు నిర్వహించినట్లయితే, సంబంధిత ఆసుపత్రిపై చట్టపరమైన చర్యలు తీసుకొని, ఆసుపత్రిని మూసివేయడం జరుగుతుందని తెలియజేయబడింది. కామారెడ్డి జిల్లాలోని ప్రతి ప్రైవేట్ ఆసుపత్రి యాజమాన్యం, ఎంటిపీల నిర్వహణకు ముందు జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ నుండి తప్పనిసరిగా అనుమతి పొందవలసినదిగా ఆదేశించారు.
జిల్లా స్థాయి ఎంటిపీ సమీక్షా సమావేశం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



