Thursday, October 30, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్జిల్లాస్థాయి సీనియర్ సాఫ్ట్ బాల్ క్రీడాకారుల ప్రబబుల్స్ జట్టు ఎంపిక

జిల్లాస్థాయి సీనియర్ సాఫ్ట్ బాల్ క్రీడాకారుల ప్రబబుల్స్ జట్టు ఎంపిక

- Advertisement -

నవతెలంగాణ  – ఆర్మూర్  : సాంఘిక సంక్షేమ బాలుర కళాశాల ఆర్మూర్ క్రీడా మైదానంలో జరిగిన సీనియర్ పురుషుల జిల్లా ప్రబబుల్స్ జట్టుకు 25 మంది క్రీడాకారులను ఎంపిక చేయడం జరిగింది. నవంబర్ 5 నుండి శిక్షణ శిబిరం నిర్వహించి తుది జట్టును ఎంపిక చేసి నవంబర్ రెండో వారంలో జరిగే రాష్ట్ర సీనియర్ సాప్ట్ బాల్ పోటీలకు పంపుతామని జిల్లా సాఫ్ట్ బాల్ అసోసియేషన్ అధ్యక్షులు బి ప్రభాకర్ రెడ్డి , ప్రధాన కార్యదర్శి మర్కంటి గంగామోహన్ తెలిపారు. ఈ  ఎంపిక‌ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ సాయన్న, వైస్ ప్రిన్సిపల్ చక్రపాణి,  జిల్లా సాఫ్ట్ బాల్ కోచ్ నరేష్, పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయుడు జ్ఞానేశ్వర్ , సీనియర్ క్రీడాకారులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -