నవతెలంగాణ – గాంధారి
జిల్లా స్థాయి అండర్ -14 బాల బాలికల సెపక్ తక్రా క్రీడా ఎంపికలు గాంధారి మండలంలోని పోతంగల్ కాలన్ ఉన్నత పాఠశాలలో ఎంపికలు నిర్వహించారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా స్థాయి u/14 బాల బాలికల సెపక్ తక్రా క్రీడా ఎంపికలు గాంధారీ మండల్ పోతంగల్ కలాన్ ఉన్నత పాఠశాలలో నిర్వహించడం జరిగింది. దీనికి పాఠశాల ప్రధానోపాధ్యాయులు రంగారావు ప్రారంభించారు. ఈ క్రీడలో మొత్తం బాల బాలికలు 80 మంది క్రీడాకారులు పోటీలలో పాల్గొనగా అందులో నుండి 10 మంది క్రీడా కారులను రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక చేయడం జరిగింది అని ఫిజికల్ డైరెక్టర్ నాగరాజు తెలిపారు. ఈ ఎంపిక కార్యక్రమంలో కామారెడ్డి ప్రధాన కార్యదర్శి పి.అశోక్ ,జిల్లా సెపక్ తక్రా కార్యదర్శి నరేష్ , ఫిజికల్ డైరెక్టర్ సత్యం, అశ్విన్ మరియు వ్యాయమ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
జిల్లా స్థాయి అండర్-14 బాల బాలికల సెపక్ తక్రా క్రీడా ఎంపికలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES