- Advertisement -
నవతెలంగాణ – ఆర్మూర్
ఆలూర్ మండలంలోని మాచర్ల గ్రామ యువత ఆధ్వర్యంలో జిల్లా స్థాయి వాలీబాల్ టోర్నమెంట్ మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ టోర్నమెంట్‌లో మొత్తం 24 జట్లు పాల్గొని ప్రతిభ ప్రదర్శించాయి. ఫైనల్‌లో పడ్కాల్ తండా జట్టు విజేతగా నిలవగా, మాచర్ల జట్టు రన్నరప్‌గా నిలిచింది. విజేత జట్టుకు రూ.8,888 నగదు బహుమతిని షేక్ సమీర్ స్పాన్సర్ చేయగా, రన్నరప్ జట్టుకు వెల్మా రాజ్‌కుమార్ బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా యెర్ర జితేందర్ హాజరై విజేత జట్లను అభినందించారు. ఈ టోర్నమెంట్ లో సమీర్, ఉప్పు గంగారెడ్డి, కొర్వా ప్రవీణ్, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -