- Advertisement -
నవతెలంగాణ – వెల్దండ
వెల్దండ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్ర భవనాన్ని జిల్లా వైద్యాధికారి రవికుమార్ శనివారం తనిఖీ చేశారు. ఆస్పత్రి మరమత్తు పనులు పూర్తయ్యాయని త్వరలో ఆస్పత్రి సేవలను పాత ఆస్పత్రి భవనంలోకి మార్చుతామన్నారు. సిబ్బంది అందుబాటులో ఉండి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు.
- Advertisement -