Tuesday, February 17, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్వైద్య శిబిరాన్ని సందర్శించిన జిల్లా వైద్యాధికారి 

వైద్య శిబిరాన్ని సందర్శించిన జిల్లా వైద్యాధికారి 

- Advertisement -

చిన్నపిల్లలకు వ్యాధి నిరోధక టీకాలు ఉంచాలి
నవతెలంగాణ – అచ్చంపేట

అమ్రాబాద్ మండలం మన్ననూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని మొల్కమామిడి, మాచారం మాచారం కాలనీ లలో వైద్య ఆరోగ్య శాఖ నాగర్ కర్నూల్, ఐటీడీఏ ల సంయుక్త ఆధ్వర్యంలో మంగళవారం ప్రత్యేక వైద్యులచే చెంచుల కోసం ప్రత్యేక వైద్య శిబిరము నిర్వహించారు.  శిబిరాన్ని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ రవికుమార్ నాయక్ సందర్శించారు. శిబిరంలో చెంచులకు అందుతున్న వైద్య సేవలు వారికి జరుగుతున్న నిర్ధారణ  పరీక్షలను పర్యవేక్షించారు. చెంచుల కోసం ప్రత్యేకంగా వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. భవిష్య భరత్ ఆధ్వర్యంలో టిబి నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు.

ఈ సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి మాట్లాడుతూ.. చెంచుల కోసం ప్రత్యేక వైద్య శిబిరాలను ఏర్పాటు చేస్తున్నామని అటవీ ప్రాంతంలో నివాసం ఉంటున్న చెంచులు వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. చెంచుల కు ఏదైనా ఆరోగ్య సమస్యలు ఉన్నట్లయితే వాటిని నిర్లక్ష్యం చేయకుండా వైద్య ఆరోగ్య శాఖ నుండి ఉచితంగా లభించే చికిత్సలను తీసుకోవాలన్నారు. రెండు వారాలకు మించి దగ్గు, జ్వరము బరువు తగ్గడం వంటి టీబి వ్యాధి లక్షణాలు ఉన్నట్లయితే వెంటనే సమీపంలోని వైద్య సిబ్బందిని సంప్రదించి, నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలన్నారు.

అదే విధంగా రక్తపోటు, మధుమేహము తదితర వ్యాధులకు కూడా నిర్ధారణ పరీక్షలు చేసుకొని వాటికి  క్రమం తప్పకుండా చికిత్స తీసుకోవాలని ఆరోగ్య సిబ్బంది అందించే సలహాలను సూచనలను పాటించాలన్నారు. ప్రధానంగా చిన్నపిల్లలకు వ్యాధి నిరోధక టీకాలు క్రమం తప్పకుండా వయసుల వారీగా మోతాదుల వారీగా ఇప్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మన్ననూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారి డాక్టర్ సుధాకర్, పీఎం జన్మన్ వాహన వైద్యాధికారి డాక్టర్ మోహన్, భవిష్య భారత్ సిబ్బంది , ఐటీడీఏ డిపిఎం సేవ్య నాయక్,  వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -