Magazines

సబ్సిడీ శనగ విత్తనాల పంపిణీ ప్రారంభం

1 గంట క్రితం

Distribution seeds begins
avatar
Shiva Kumar

ప్రచురించబడింది అక్టో 13, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ – బజార్‌హత్నూర్‌: మండల కేంద్రంలోని రైతు వేదికలో రాష్ట్ర ప్రభుత్వం రబీ సాగు కోసం సబ్సిడీపై అందిస్తున్న శనగ విత్తనాల పంపిణీ కార్యక్రమాన్ని స్థానిక సర్పంచ్‌ పరచ సాయన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా రైతులకు ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీ విత్తనాలను సద్వినియోగం చేసుకొని రబీ సాగులో మంచి దిగుబడులు సాధించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏఈవోలు సంతోష్‌, శ్రీకాంత్‌, ప్రవీణ్‌, రాజేశ్వర్‌, భోజన్నతో పాటు పలువురు రైతులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్