తక్కువ నీటితో పండే ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలి
నవతెలంగాణ – బజార్‌హత్నూర్
మండల కేంద్రంలోని రైతు వేదికలో ఎల్‌నినో ప్రభావంపై దృశ్యశ్రవణ మాధ్యమం ద్వారా రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ.. ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందని, రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తక్కువ నీటితో పండే ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయడంతో పాటు నీటి యాజమాన్య పద్ధతులను పాటించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్‌శ్యాంసుందర్, ఎంపీడీవో మహేందర్ రెడ్డి, వ్యవసాయ విస్తరణ అధికారులు (ఏఈవోలు) సంతోష్, భోజన్న, శ్రీకాంత్, పంచాయతీ కార్యదర్శులు, రైతు వేదిక సభ్యులు పాల్గొన్నారు.





కామెంట్‌లు (0)