నవతెలంగాణ - మర్రిగూడ
మూగజీవుల దాహార్తి కోసం మండలంలోని అజ్జలాపురం గ్రామంలో నీటి తొట్లను నింపాలని కోరుతూ ఆ గ్రామానికి చెందిన గిరిజన విద్యార్థి సంఘం మునుగోడు నియోజకవర్గం అధ్యక్షులు డాక్టర్ మెగావత్ చందు నాయక్ సోమవారం మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో ఎంపీడీవో జిసి మున్నయ్య కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా చందు నాయక్ మాట్లాడుతూ.. ఎల్ నినో ప్రభావంతో వర్షాలు లేక చెరువులు, కుంటలు ఎండిపోయాయని మూగజీవుల దాహార్తి కోసం ఉపాధి హామీ పథకంలో నిధులు కేటాయించి నీటి తొట్లను నింపే విధంగా ప్రజాప్రతినిధులు చొరవ తీసుకోవాలని కోరారు.





కామెంట్‌లు (0)