Magazines

విద్యార్థులు, కార్మికులు, రైతులతో విస్తృత పోరాట వేదిక : ఎం.ఎ. బేబి

1 గంట క్రితం

cpim
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 12, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-హైదరాబాద్: విద్యార్థులు, కార్మికులు, రైతులతో విస్తృత పోరాట వేదికను ఏర్పాటు చేయాలని సీపీఐ(యం) ప్రధాన కార్యదర్శి ఎం.ఎ. బేబి పిలుపునిచ్చారు. ఢిల్లీలో నిరసనలపై కేంద్రం ఆంక్షలు విధిస్తూ అణిచివేత చర్యలకు పాల్పడటాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. ఢిల్లీలో మోడీ ప్రభుత్వం వ్యవహరించిన తీరును ‘క్రూరత్వం’గా అభివర్ణించారు.


ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ కోసం విద్యార్థులు, యువత, మహిళలు, కార్మికులు, రైతులు, పౌర సమాజ ప్రతినిధులు, మేధావులతో కూడిన విస్తృత పోరాట వేదికను ఏర్పాటు చేయాలని పిలుపునిచ్చారు. దేశవ్యాప్తంగా వివిధ సంఘాలు, సంస్థలు, ప్రజా ప్రముఖులను ఏకతాటిపైకి తీసుకువచ్చి ఉద్యమాన్ని బలోపేతం చేస్తామని అన్నారు. వీధుల్లో, విద్యాసంస్థల్లో, విశ్వవిద్యాలయాల్లో నిరసన కార్యక్రమాలతో పాటు న్యాయపరమైన పోరాటాన్ని కూడా కొనసాగిస్తామని పేర్కొన్నారు. ఢిల్లీని ‘యుద్ధ క్షేత్రం’గా మార్చారని మండిపడ్డారు.


నగరంలో విధించిన ఆంక్షలపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన తొలి రాజకీయ పార్టీ సిపిఐ(యం) అని అన్నారు. నిరసనలు, అసమ్మతి తెలుపుతున్న కారణంగా మొత్తం రాజధానిని స్తంభింపజేయకూడదన్న సుప్రీంకోర్టు వ్యాఖ్యలను స్వాగతించారు. ఇంటర్నెట్ సేవలను పునరుద్ధరించాలని, ఆంక్షలు సహేతుకమైన పరిధిలోనే ఉండాలని కోర్టు పేర్కొన్న విషయాన్ని ఆయన ప్రస్తావించారు. ప్రజాస్వామ్య హక్కులను కాపాడేందుకు వివిధ వర్గాల ప్రజలను సమీకరించి ఉద్యమాన్ని మరింత విస్తృతం చేస్తామని స్పష్టం చేశారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్