Magazines

శాంతియుతంగా పండుగను జరుపుకోవాలి

1 గంట క్రితం

festival peacefully
avatar
Shiva Kumar

ప్రచురించబడింది అక్టో 12, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ - ముధోల్
దమ్మచక్ర పరివర్తన దినోత్సవంను శాంతియుతంగా జరుపుకోవాలని ముధోల్ సిఐ రవీందర్ నాయక్ అన్నారు. ముధోల్ పోలీస్ స్టేషన్లో సోమవారం సాయంత్రం దళిత సంఘాల నాయకులు, సంఘల సభ్యులతో ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ నెల 20న నిర్వహించే దమ్మచక్ర పరివర్తన కార్యక్రమాన్ని శాంతియుతంగా జరుపుకొని, పోలీసులకు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా నిబంధనలను వారికి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ముధోల్ ఎస్ఐ బిట్ల పెర్సిస్, సంఘాల నాయకులు, సభ్యులు, పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్