కలెక్టర్ కు వినపత్రం అందజేసిన సర్పంచ్
నవతెలంగాణ - మల్హర్ రావు
తాడిచెర్ల గ్రామపరిధిలోగల శాత్రజ్ పల్లిలో శనివారం అర్ధరాత్రి ముందస్తుగా సమాచారం,నోటీసులు ఇవ్వకుండా,గ్రామసభ నిర్వహించకుండా ఉన్నతాధికారుల ఆదేశాలు ఉన్నాయంటూ దాదాపు 347 ఇండ్లను బుల్లోజర్లతో కూల్చరని,వారికి న్యాయం చేయాలని సోమవారం గ్రామ సర్పంచ్ బండి స్వామి,బాధితులు వినతిపత్రం అందజేశారు.అక్రమంగా కూల్చివేసిన అధికారులు సంఘటనపై సమగ్ర విచారణ జరిపించి, బాధితులకు నష్టపరిహారం అందించాలని కోరారు.
శార్రాజ్ పల్లిలో వ్యవసాయ భూములు ఉన్నందున,వ్యవసాయ పనులు నిర్వహించుకోవడానికి,నివాస అవసరాల కోసం,పశువుల సంరక్షణ కోసం తమ సొంత ఖర్చులతో గృహాలు,పశువుల కొట్టాలు,ఇతర నిర్మాణాలను నిర్మించుకొని గత కొంతకాలంగా వినియోగించుకుంటున్నామని తెలిపారు.అయితే అర్ధరాత్రి కూల్చివేయడం జరిగిందని,అడ్డుకున్న పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు.వ్యవసాయ కార్యకలాపాలు, జీవనోపాది కోసం అప్పులు చేసి ఇండ్లు కట్టుకుంటే తెల్లవారేసరికి వందలాది ఇండ్లు నేలమట్టం చేయడంతో పశువులకు,తమకు సంరక్షణ లేకుండా పోయిందన్నారు.వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్న కుటుంబాలకు ఆర్థికంగా తీవ్ర నష్టం వాటిల్లిందని చెప్పారు. ఇప్పటికైనా కలెక్టర్ స్పందించి నష్టపరిహారం చెల్లించాలని విజ్ఞప్తి చేశారు.







కామెంట్‌లు (0)