నవతెలంగాణ - భీంగల్
ప్రమాదవశాత్తూ స్కూటీ అదుపుతప్పి వ్యక్తి మృతి చెందిన ఘటన ఆదివారం చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం... భీంగల్ మండల పరిధిలోని పల్లికొండ గ్రామ శివారులో ఈ నెల 10న చౌడా తండాకు చెందిన రామావత్ రవి (38) తన నాలుగేళ్ల కుమారుడు జస్వంత్‌తో కలిసి భీంగల్ ఆస్పత్రికి వెళ్లి, జూపిటర్ స్కూటీపై స్వగ్రామానికి వెళ్తుండగా.. పల్లికొండ గ్రామ శివారులో స్కూటీ అదుపుతప్పి రోడ్డుపై పడిపోయింది. ఈ ప్రమాదంలో రవికి తల, చేతికి గాయాలు కాగా, కుమారుడు జస్వంత్ ముఖానికి గాయాలయ్యాయి.
ఈ క్రమంలో నిజామాబాద్‌లోని సన్‌రైజ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఈ నెల 11న మృతి చెందాడు. ఈ ఘటనపై రవి బావ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.







కామెంట్‌లు (0)