నవతెలంగాణ-హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ విజయవాడలో ఘోర ప్రమాదం జరిగింది. స్థానిక బైపాస్ రోడ్డులో కారు రెయిలింగ్‌ను ఢీకొట్టింది. దీంతో కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. కారులో ప్రయాణిస్తున్న నలుగురు సజీవ దహనమయ్యారు. స్థానికులు వెంటనే స్పందించి.. పోలీసులతోపాటు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. మృతులు గుంటూరు జిల్లా నంబూరు, విజయవాడ సమీపంలోని నున్న వాసులని పోలీసులు పేర్కొన్నారు. మృతులు రాందేవ్, అరుణ, విజయతోపాటు చిన్నారిగా గుర్తించామని అన్నారు.







కామెంట్‌లు (0)