నవతెలంగాణ - ముధోల్
హైదరాబాద్‌లోని పంచాయతీరాజ్ కమిషనర్ కార్యాలయంలో గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ దివ్య దేవరాజన్‌ను సోమవారం ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పాటిల్ కలిశారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలపై వినతిపత్రాన్ని కమిషనర్‌కు ఎమ్మెల్యే అందజేశారు.
వీబీజీ రామ్‌జీ పథకం ద్వారా మెటీరియల్ పేమెంట్స్ కింద పొలంబాట పనులు చేపట్టేందుకు చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే కోరారు. ముధోల్ నియోజకవర్గంలో పెండింగ్‌లో ఉన్న సీసీ రోడ్లు, మురికి కాలువలు, ఐకేపీ భవనాలు, గ్రామపంచాయతీ భవన నిర్మాణ పనులకు సంబంధించిన బిల్లులను వెంటనే విడుదల చేయాలని ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు. అలాగే గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించేందుకు నూతన రోడ్ల నిర్మాణానికి అవసరమైన నిధులు మంజూరు చేయాలని కమిషనర్‌ను కోరారు. ఎమ్మెల్యే వెంట మాజీ ఎంపీటీసీ సభ్యులు పట్టేపూర్ సతీష్ రెడ్డి ఉన్నారు.







కామెంట్‌లు (0)