నవతెలంగాణ - ముధోల్
సికింద్రాబాద్‌లోని రైల్ నిలయంలో దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ శ్రీ సంజయ్ కుమార్ శ్రీవాస్తవను ముధోల్ శాసనసభ్యులు శ్రీ పవార్ రామారావు పాటిల్ సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా బాసర రైల్వే స్టేషన్‌లో రైల్వే గూడ్స్ రేక్ పాయింట్ ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే కోరారు. ఈ సదుపాయం అందుబాటులోకి వస్తే రైతులు, వ్యాపారులు, స్థానిక ప్రజలకు సరుకు రవాణాలో ఎంతో ప్రయోజనం చేకూరుతుందని వివరించారు.
బాసర రైల్వే స్టేషన్‌లో ఇప్పటికే అందుబాటులో ఉన్న మౌలిక సదుపాయాలను వినియోగించుకుంటూ, అవసరమైన గూడ్స్ సైడింగ్, సరుకుల లోడింగ్–అన్‌లోడింగ్ సదుపాయాల ఏర్పాటుకు సాధ్యాసాధ్యాలను పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని జనరల్ మేనేజర్‌ను ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు. ఈ విన్నపంపై జనరల్ మేనేజర్ సానుకూలంగా స్పందించిన్నట్లు ఎమ్మెల్యే ఓక్క ప్రకటనలో తెలిపారు. ఈ ప్రతిపాదనపై సంబంధిత అధికారుల నుంచి నివేదిక తెప్పించుకొని, సాధ్యాసాధ్యాలను పరిశీలించి తదుపరి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈయన వెంట సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు, ఉన్నారు.







కామెంట్‌లు (0)