Magazines

ఢిల్లీలో 20వేల మంది పారామిలిటరీ సిబ్బంది

1 గంట క్రితం

paramilitary personnel
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 12, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-హైదరాబాద్: కేంద్ర ఎన్నికల సంఘం నిర్వహించిన సర్ సర్వేలో భారీగా ఓట్ల తొలగింపులను వ్యతిరేకిస్తూ, సీఈసీ జ్ఞానేష్ కుమార్ తక్షణమే రాజీనామా చేయాలని ఇండియా బ్లాక్ కూటమి పార్టీలు డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈక్రమంలో ప్రతిపక్షాలు నిరసన ప్రదర్శన కార్యచరణ ప్రణాళికలను రూపొందించాయి.


జంతర్ మంతర్, పార్లమెంట్, రాజ్ ఘాట్ వద్ద ఆందోళనలు నిర్వహించాయి. సోమవారం ప్రధాన న్యాయమూర్తికి వినతి పత్రం అందజేయడానికి సుప్రీంకోర్టు వైపు భారీ శాంతియుత ర్యాలీ నిర్వహించాయి ప్రతిపక్షాలు. ఈ తరుహా వరుస నిరసనలను, ఆందోళలను అణచివేయడానికి కేంద్రంలోని బీజేపీ సర్కార్ కూడా అనేక ఆంక్షలు విధించింది. ఆయా మార్గాల్లో రోడ్లు మూసివేయడంతో పాటు రవాణా సదుపాయాలను ఆపివేసింది. ఇంటర్ నెట్ పై ఆంక్షలు విధించింది.


ఈక్రమంలోనే ఆందోళనలకారులను అదుపు చేయడానికి భారీగా బలగాలను మోహరించింది మోడీ ప్రభుత్వం. దాదాపు 20,000 మంది పారామిలిటరీ సిబ్బంది మోహరించినట్లు జాతీయ మీడియా సంస్థలు కథనాలు వెలువరించాయి.


ఒక నెల పాటు ఢిల్లీ వ్యాప్తంగా మకాం వేసినట్లు పేర్కొన్నాయి. ప్రతిపక్షాల ఆందోళలను కట్టడి చేయడానికి ముందుస్తు ప్రణాళికతోనే మోడీ ప్రభుత్వం వ్యవహరించిందని పేర్నొన్నాయి. ఇండియా బ్లాక్, సీజేపీ ఆందోళనల నేపథ్యంలో ధర్నా ప్రాంతాల్లో ఎక్కడికక్కడ బారికేడ్లను ఏర్పాటు చేసి, శాంతియుత ర్యాలీని నిలువరించడానికి సదురు బలగాలు యత్నించాయి.



ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్