Magazines

కమ్యూనిటీ హెల్త్ సెంటర్ లో బతుకమ్మ వేడుకలు

1 గంట క్రితం

Bathukamma
avatar
Shiva Kumar

ప్రచురించబడింది అక్టో 12, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-మర్రిగూడ 

మండల కేంద్రంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ లో సోమవారం హాస్పిటల్ సూపరిండెంట్ శంకర్ నాయక్ ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆస్పత్రి సిబ్బంది రంగు రంగుల పూలతో బతుకమ్మను పేర్చి అందంగా అలంకరించి కాసేపు బతుకమ్మ ఆడారు. ఈ సందర్భంగా ఆస్పత్రి సూపరిండెంట్ శంకర్ నాయక్ మాట్లాడుతూ.. తెలంగాణ అంటే బతుకమ్మ..బతుకమ్మ అంటే తెలంగాణ అనే విధంగా తీరొక్క పూలతో బతుకమ్మ వేడుకలను జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ వినయ్, డాక్టర్ రాధిక, హెడ్ సిస్టర్స్ సతమ్మ, లలిత, శ్రీదేవి, జ్యోతి, సిస్టర్స్ అనురాధ, మంగమ్మ, సునీత, కీర్తి, దుర్గ, ఆరోగ్య మిత్ర గిరి యాదయ్య, సిబ్బంది పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్