రోడ్డు ప్రమాద బాధితులకు తక్షణ సాయం.. ఆస్పత్రికి తరలింపు
నవతెలంగాణ – బజార్‌హత్నూర్
ఆపదలో ఉన్నవారికి అండగా నిలిచి బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మానవత్వాన్ని చాటుకున్నారు. బజార్‌హత్నూర్ మండలంలోని జాతర్ల గ్రామ సమీపంలో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మోర్ఖండి మాజీ సర్పంచ్ తొడసం ఇస్తారీతో పాటు భూర్ఖప్పల్లి గ్రామానికి చెందిన మరో వ్యక్తి గాయపడ్డారు.
అదే సమయంలో అటుగా వెళ్తున్న ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ప్రమాదాన్ని గమనించి వెంటనే తన వాహనాన్ని ఆపారు. క్షతగాత్రుల వద్దకు వెళ్లి వారి పరిస్థితిని తెలుసుకొని, ఏమాత్రం ఆలస్యం చేయకుండా ప్రైవేట్ వాహనంలో స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించేలా చర్యలు తీసుకున్నారు. ఆపద సమయంలో స్పందించి బాధితులకు తక్షణ సహాయం అందించిన ఎమ్మెల్యే తీరుపై స్థానికులు అభినందనలు వ్యక్తం చేశారు. ప్రజాప్రతినిధిగా తన బాధ్యతను నిర్వర్తిస్తూ మానవత్వాన్ని చాటుకున్నారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో డుబ్బుల చంద్రశేఖర్, విద్యాసాగర తదితరులు పాల్గొన్నారు.






కామెంట్‌లు (0)