నవతెలంగాణ - ముధోల్
గోదావరి పుష్కరాల సందర్భంగా వివిధ శాఖల ఆధ్వర్యంలో చేపట్టిన పనులన్నింటినీ పకడ్బందీగా పూర్తి చేయాలని నిర్మల్ కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులను ఆదేశించారు. గురువారం బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి దేవస్థానం ఈవో కార్యాలయంలో పుష్కరాల పనుల నిర్వహణపై సంబంధిత అధికారులతో కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ క్రమంలో బాసరలో జరుగుతున్న పనుల వివరాలను శాఖల వారీగా అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రతి అధికారి తమ పరిధిలోని పనులను నిరంతరం పర్యవేక్షించాలని, గడువులోగా పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.
భక్తులకు తాగునీరు, మరుగుదొడ్లు, దుస్తులు మార్చుకునే గదులు, పార్కింగ్ వంటి సౌకర్యాలన్నీ కల్పించాలని ఆదేశించారు. పుష్కరాల నిర్మాణ పనులకు సంబంధించి అటవీ శాఖ అనుమతులు ఏవైనా ఉంటే, వెంటనే ప్రక్రియ పూర్తి చేసి పనులు ప్రారంభించాలని తెలిపారు. వివిధ ప్రాంతాల నుండి వచ్చే భక్తుల కోసం విశాలమైన పార్కింగ్ సదుపాయాలు ఏర్పాటు చేయాలని, అలాగే భక్తుల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ఈ సమావేశంలో భైంసా సబ్ కలెక్టర్ అజ్మీరా సంకేత్ కుమార్, ఆర్డబ్ల్యూఎస్ ఈఈ సందీప్, హార్టికల్చర్ అధికారి రమణ, ఆలయ ఈవో అంజనా దేవి, తహసిల్దార్ పవన్ చంద్ర, ఆయా శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.






కామెంట్‌లు (0)