Magazines

జీడీసీ సీతాఫల్‌మండి కళాశాలలో ఘనంగా బతుకమ్మ వేడుకలు

1 గంట క్రితం

gdc.jpg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 08, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-హైదరాబాద్: హైదరాబాద్ సీతాఫల్‌మండిలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బతుకమ్మ పండుగ వేడుకలను ఘనంగా నిర్వహించారు. గురువారం సాంస్కృతిక క్లబ్ మహిళా సాధికారత సెల్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ వేడుకలు చేపట్టారు.


ఈ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ బంగ్లా భారతి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ .. బతుకమ్మ పండుగ తెలంగాణ మహిళల ఆత్మగౌరవానికి, ప్రకృతి ప్రేమకు, సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తుందని తెలిపారు. యువత తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను పరిరక్షిస్తూ భవిష్యత్ తరాలకు అందించాలని ఆకాంక్షించారు.


కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ ఎన్.జి. కృష్ణమూర్తి, ఐక్యూఏసీ కో-ఆర్డినేటర్ డా. జైపాల్, ఏసీఓ డా. సైదులు, సాంస్కృతిక క్లబ్ కో-ఆర్డినేటర్ డా. రాజు, బి. వెంకటేష్, ఎన్‌ఎన్‌ఎస్ పీఓ, డా. సుధా, డా. సరోజ, రాఘవేంద్ర, డా. శివనారాయణ, బి. రాజిని, సమతా వాణి, విమలాదేవి, డా. కిశోర్, స్వప్న, చందన, నిర్మల, సాయి కుమార్ తదితర బోధనా సిబ్బంది పాల్గొన్నారు.


బోధనేతర సిబ్బంది శిల్ప, ఈశ్వరి, వినోద్, రామకృష్ణ, ఇన్నారెడ్డి, శ్రీనివాస్ తదితరులు కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో తమ సహకారం అందించారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ వేడుకల్లో కళాశాల అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది, విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.


విద్యార్థుల తరఫున సాయి కుమార్, ఖలీద్, స్నేహ, సంధ్య తదితరులు పాల్గొని బతుకమ్మ వేడుకల్లో ఉత్సాహంగా సందడి చేశారు. విద్యార్థినులు సంప్రదాయ దుస్తుల్లో పాల్గొని బతుకమ్మలను అందంగా అలంకరించి, పాటలు పాడుతూ, నృత్యాలతో వేడుకలను మరింత వైభవంగా నిర్వహించారు.


తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణతో పాటు మహిళా సాధికారత, సామాజిక ఐక్యతను ప్రోత్సహించేలా నిర్వహించిన ఈ కార్యక్రమం ఘన విజయం సాధించింది. కళాశాల ఆవరణలో పండుగ వాతావరణం నెలకొని, పాల్గొన్న వారందరిలో ఆనందోత్సాహాలను నింపింది.

bhaSitaphalmandi College

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్