Magazines

15 రోజులైనా పునరుద్ధరించని ట్రాన్స్‌ఫార్మర్‌.. ఆందోళనలో ధర్మారం రైతులు

1 గంట క్రితం

transftr
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 09, 2026 | 1 నిమిషాల చదవడం

 నవతెలంగాణ-జన్నారం: రైతులకు సాగునీరు అందించి పంటలు కాపాడాల్సిన విద్యుత్‌ శాఖ నిర్లక్ష్యం రైతులకు శాపంగా మారిందని జన్నారం మండలం ధర్మారం గ్రామ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు రైతుల పొలాల్లో ఏర్పాటు చేసిన ట్రాన్స్‌ఫార్మర్‌ స్తంభం కూలిపోయి 15 రోజులు గడుస్తున్నా ఇప్పటివరకు ట్రాన్స్‌ఫార్మర్‌ను పునరుద్ధరించకపోవడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

15 రోజులుగా ఎదురుచూపులే!...
ధర్మారం గ్రామానికి చెందిన రైతుల వ్యవసాయ పొలాలకు విద్యుత్‌ సరఫరా చేసే ట్రాన్స్‌ఫార్మర్‌ స్తంభం వర్షాలకు కూలిపోవడంతో సాగు పనులకు ఆటంకం ఏర్పడింది. ట్రాన్స్‌ఫార్మర్‌ను తిరిగి ఏర్పాటు చేయాలని రైతులు పలుమార్లు సంబంధిత అధికారులకు, కాంట్రాక్టర్‌కు విన్నవించినప్పటికీ, ఏర్పాటు చేస్తామని చెబుతూ కాలయాపన చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. 15 రోజులుగా సమస్య పరిష్కారం కాకపోవడంతో పంటలకు నీరందించలేక నష్టపోయే పరిస్థితి ఏర్పడిందని రైతులు ఆందోళన చెందుతున్నారు.


పంట నష్టానికి బాధ్యత ఎవరిది?
వ్యవసాయానికి కీలకమైన సమయంలో విద్యుత్‌ సరఫరా నిలిచిపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రైతుల సమస్యలపై అధికారులు స్పందించకపోవడం, కాంట్రాక్టర్‌ పనులు పూర్తి చేయకపోవడంపై గ్రామస్తులు మండిపడుతున్నారు. రైతులకు నష్టం జరిగితే బాధ్యత ఎవరు వహిస్తారని ప్రశ్నిస్తున్నారు. రైతుల సంక్షేమమే లక్ష్యమని చెప్పే ప్రభుత్వం క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న ఇలాంటి సమస్యలపై ఎందుకు స్పందించడం లేదని నిలదీస్తున్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్