Magazines

11న ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహ ఆవిష్కరణ

1 గంట క్రితం

avatar
Shiva Kumar

ప్రచురించబడింది అక్టో 08, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-సత్తుపల్లి

​సత్తుపల్లి పట్టణ పద్మశాలి సేవా సంఘం ఆధ్వర్యంలో ఈనెల 11వ తేదీ (ఆదివారం) ఉదయం 9:00 గంటలకు స్థానిక మున్సిపల్ కార్యాలయం ఎదురుగా మెయిన్ రోడ్డు వద్ద ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నట్లు పద్మశాలి సేవా సంఘం సత్తుపల్లి పట్టణ అధ్యక్షుడు పర్వతం నాగేశ్వరరావు, గౌరవ అధ్యక్షుడు వంగరి పద్మారావు తెలిపారు.


ఈ కార్యక్రమానికి రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, చేనేత జౌళి శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ముఖ్య అతిథిగా హాజరై విగ్రహాన్ని ఆవిష్కరిస్తారని తెలిపారు. విశిష్ట అతిథులుగా ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్, తెలంగాణ పద్మశాలి సంఘం రాష్ట్ర అధ్యక్షులు కమర్తపు మురళి, ప్రధాన కార్యదర్శి మాచర్ల రామచంద్రరావు, జిల్లా అధ్యక్షులు చిలకమర్రి శ్రీనివాసబాబు, మున్సిపల్ చైర్‌పర్సన్ మొహమ్మద్ రెహానా కమల్, కౌన్సిలర్ మట్టా దేవజ్యోతి పాల్గొంటారని వివరించారు.  ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పద్మశాలి బంధువులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై  విజయవంతం చేయాలని నాగేశ్వరరావు, పద్మారావు కోరారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్