Magazines

అనారోగ్య బాధితుడికి సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కు అందజేత

1 గంట క్రితం

CMRF CHEQUE
avatar
Shiva Kumar

ప్రచురించబడింది అక్టో 08, 2026 | 1 నిమిషాల చదవడం

- కాంగ్రెస్ పార్టీ మండల ఉపాధ్యక్షులు ఉషనగల్ల స్వామి

నవతెలంగాణ–రాయపోల్‌

సీఎం సహాయనిధి ద్వారా నిరుపేద కుటుంబాలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని కాంగ్రెస్ పార్టీ మండల ఉపాధ్యక్షులు ఉషనగల్ల స్వామి అన్నారు. గురువారం రాయపోల్‌ మండల కేంద్రానికి చెందిన ఉషనగల్ల ఎల్లయ్యకు సీఎం సహాయనిధి చెక్కు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాయపోల్ మండల కేంద్రానికి చెందిన ఎల్లయ్య గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ ఆస్పత్రిలో చికిత్స పొందారు.


చికిత్సకు అధికంగా ఖర్చు కావడంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఎల్లయ్య ముఖ్యమంత్రి సహాయ నిధి కోసం దరఖాస్తు చేసుకున్నారు. దీంతో ప్రభుత్వం రూ.34 వేల సీఎం సహాయ నిధి ద్వారా ఆర్థిక సహాయం మంజూరు చేసింది.మంజూరైన చెక్కును లబ్ధిదారుడు ఎల్లయ్యకు అంత చేయడం జరిగిందన్నారు. ఇలాగే మండలంలో ఎవరైనా అనారోగ్యంతో బాధపడితే సీఎం సహాయనిధి పథకానికి దరఖాస్తు చేసుకుని ద్వారా లబ్ధి పొందాలని ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు నర్సింగరావు, యూసుఫ్‌, నాగేశ్వరరావు, అశోక్‌ తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్