Magazines

నూతన ఎస్‌ఐకి బీఆర్‌ఎస్‌ నాయకుల శుభాకాంక్షలు

1 గంట క్రితం

new SI
avatar
Shiva Kumar

ప్రచురించబడింది అక్టో 08, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ - రాయపోల్‌

రాయపోల్‌ పోలీస్‌స్టేషన్‌ కు నూతన ఎస్‌ఐగా బాధ్యతలు స్వీకరించిన బి. లింగంను బీఆర్‌ఎస్‌ నాయకులు గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనను శాలువాతో ఘనంగా సత్కరించి, రాయపోల్‌ మండలానికి స్వాగతం పలుకుతూ శుభాకాంక్షలు తెలిపారు. మండలంలో శాంతిభద్రతల పరిరక్షణకు నూతన ఎస్‌ఐగా బి. లింగం సమర్థవంతంగా విధులు నిర్వహించాలని వారు ఆకాంక్షించారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ శాంతిభద్రతల పరిరక్షణకు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ మాజీ మండల అధ్యక్షులు వెంకటేశ్వర శర్మ, మాజీ జెడ్పిటిసి లింగాయపల్లి యాదగిరి,నాయకులు రాజిరెడ్డి, తిరుపతి నర్సింలు, నవీన్ గౌడ్, అయ్యగల్ల రవి, లక్ష్మారెడ్డి, వీరస్వామి, లింగం, కార్యకర్తలు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్