Magazines

అశ్వారావుపేటలో గ్రాడ్యుయేట్ ఓటర్ల నమోదు

6 గంటల క్రితం

mlc elections
avatar
Shiva Kumar

ప్రచురించబడింది అక్టో 03, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ - అశ్వారావుపేట 

మండలంలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటర్ల నమోదు కార్యక్రమం కొనసాగుతోంది. అర్హులైన పట్టభద్రులను ఓటర్లుగా నమోదు చేసేందుకు గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. బీఆర్‌ఎస్‌ నాయకులు కాసాని చంద్రమోహన్, డాక్టర్ భూక్య ప్రసాద్‌రావు ఆధ్వర్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పలు గ్రామాల్లో ఇంటింటికీ వెళ్లి నమోదు ప్రక్రియపై అవగాహన కల్పిస్తున్నారు.


ఊట్లపల్లి, వేదాంతపురం, కేశప్పగూడెం, జమ్మిగూడెం గ్రామపంచాయతీల్లో ఫారం–18 దరఖాస్తుల పూరణ, అవసరమైన ధ్రువపత్రాల సేకరణ, ఆన్‌లైన్‌ నమోదు ప్రక్రియలో పట్టభద్రులకు సహకరిస్తున్నారు. అర్హత ఉన్న ప్రతి పట్టభద్రుడు ఓటరుగా నమోదు చేసుకోవాలని కార్యక్రమ నిర్వాహకులు సూచించారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాలకు చెందిన ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, బీఎల్‌ఓలు, స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఊట్లపల్లి, జమ్మిగూడెం, కేశప్పగూడెం, వేదాంతపురం గ్రామాల్లో నమోదు ప్రక్రియను పర్యవేక్షించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్