Magazines

కేసప్పగూడెంలో ఘనంగా పోషకాహార వారోత్సవాలు

1 రోజు క్రితం

Nutrition
avatar
Shiva Kumar

ప్రచురించబడింది అక్టో 05, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ - అశ్వారావుపేట

పోషకాహారంతోనే తల్లీబిడ్డల సంపూర్ణ ఆరోగ్యం సాధ్యమని ఐసీడీఎస్ అధికారులు, సిబ్బంది పేర్కొన్నారు. అశ్వారావుపేట ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలోని జమ్మిగూడెం సెక్టార్ కేసప్పగూడెంలో సోమవారం పోషకాహార వారోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తల్లులకు పోషకాహార వారోత్సవాల ప్రాధాన్యతను వివరించారు. పోషక విలువలు కలిగిన ఆహారం తీసుకోవడం ద్వారా సంపూర్ణ ఆరోగ్యం చేకూరుతుందని తెలిపారు. గర్భిణులు, బాలింతలు అంగన్‌వాడీ కేంద్రాల్లో అందించే ఆరోగ్యలక్ష్మి పౌష్టికాహార భోజనాన్ని తప్పనిసరిగా తీసుకోవాలని సూచించారు. అల్ప వ్యయంతో లభించే అధిక పోషక విలువలు కలిగిన ఆహారాన్ని తీసుకోవడం ద్వారా తల్లులు ఆరోగ్యంగా ఉండటంతో పాటు ఆరోగ్యవంతమైన బిడ్డకు జన్మనివ్వవచ్చని తెలిపారు. అనంతరం గర్భిణులకు సీమంతాలు నిర్వహించారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి సతీష్‌కుమార్, స్థానిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రాము, అంగన్‌వాడీ టీచర్లు లక్ష్మీ కుమారి, నర్సమ్మ, వెంకాయమ్మ, సుధ తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్