నవతెలంగాణ-సత్తుపల్లి
హైదరాబాద్‌లోని ఉస్మానియా యూనివర్సిటీలో మంగళవారం నిర్వహించిన మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ (ఎంఎస్ఎఫ్) జాతీయ ప్రతినిధుల సభకు సత్తుపల్లి నుంచి ఎమ్మార్పీఎస్ నాయకులు భారీగా తరలివెళ్లారు. సీనియర్ నాయకులు గోళ్లమూడి శ్రీనివాసరావు మాదిగ ఆధ్వర్యంలో ఎమ్మార్పీఎస్, ఎంఎస్ఎఫ్ నాయకులు, విద్యార్థులు తెల్లవారుజామునే హైదరాబాద్‌కు బయలుదేరి వెళ్లారు. ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి పరిగడుపు లక్ష్మణ్ మాదిగ, మహాజన సోషలిస్ట్ పార్టీ మండల అధ్యక్షుడు గద్దల దేవయ్య మాదిగ, విద్యార్థి నాయకులు గంధం రామకృష్ణ మాదిగ, గద్దల చాణక్య కుమార్ మాదిగ, సింగిచాల రాము మాదిగ హైదరాబాద్ సభకు తరలి వెళ్లారు. ఉస్మానియా యూనివర్సిటీలో జరిగిన ఈ ప్రతినిధుల సభకు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.





కామెంట్‌లు (0)