Magazines

విలేఖరి సోపాన్ గురూజీ కుటుంబానికి పరామర్శ

43 నిమిషాల క్రితం

journalist's family
avatar
Shiva Kumar

ప్రచురించబడింది అక్టో 07, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-మద్నూర్

హిందీ మిలాప్ విలేఖరి సోపాన్ గురూజీ సతీమణి ఇటీవల మృతి చెందిన విషయం విధితమే. విషయం తెలుసుకున్న జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హనుమంతు షిండే బుధవారం విలేఖరి కుటుంబాన్ని పరామర్శించారు. సోపాన్‌ సతీమణి మృతికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. ఆమె మృతి పట్ల ప్రగాఢ సానుభూతి తెలియజేసి, ఆమె చిత్రపటానికి పూలు మాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో మద్నూర్ మండల బిఆర్ఎస్ నాయకులు బన్సీ పటేల్, కృష్ణ పటేల్, కంచన్వార్ హనుమాన్లు, శంకర్, తదితరులు ఉన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్